అభివృద్ధి ధ్యేయంగా పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని

555చూసినవారు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సొంత నిధులు వెచ్చించి డ్రైనేజ్ ప్రధాన మురికి కాలువలు పరిశుభ్రం చేయడానికి మంగళవారం పనులు ప్రారంభించారు. హిటాచి సహాయంతో కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మొక్కలను తొలగించి నిలిచిపోయిన మురికి నీటిని డ్రైనేజీ కాలువ ద్వారా బయటకు తరలించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే అభివృద్ధే ధ్యేయంగా పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.