శెట్టూరు మండల కేంద్రంలోని ఎంపిపి ఫౌండేషన్ ప్లస్ స్కూల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా మహిళల అకౌంట్లో వేస్తున్న సొమ్ము వృథా కావడం లేదన్నారు.