ఈనెల 12వ తేదీ పుట్టపర్తి నియోజకవర్గంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైకిల్ యాత్ర ద్వారా రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం హిందూపురంలో బయలుదేరి మధ్యాహ్నం పుట్టపర్తి నియోజకవర్గాన్ని చేరుకుంటారు. రోడ్డు షో ముగిసిన అనంతరం కదిరి కి వెళ్తారని బుధవారం టీడీపీ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.