పుట్టపర్తి మండల పరిధిలో అక్రమమద్యం విక్రయిస్తున్న వారిపై శనివారం ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, సిబ్బందితో కలిసి కర్ణాటకనాగేపల్లి క్రాస్ వద్ద అక్రమ మద్యం దాడులు జరిపారు. మద్యం విక్రయిస్తున్న రామలింగయ్య అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 10 ఆంధ్రప్రదేశ్ మద్యం బాటిల్స్ లను స్వాదినం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, బి. ఉమామనోహర్ రాజు పాల్గొన్నారు.