శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలో గల కొత్తపల్లి తాండాలో నాటు సారాయి తయారీపై ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పుట్టపర్తి ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్, అనంతపురం ఏసీ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్, వారి సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. 300 లీటర్స్ బెల్లపు ఊటను ధ్వంసం చేసారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్, ఉమామనోహర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.