పుట్టపర్తి: మహిళపై దాడి చేసిన వారిని శిక్షించాలి

79చూసినవారు
పుట్టపర్తి: మహిళపై దాడి చేసిన వారిని శిక్షించాలి
పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో వెంకటలక్ష్మి అనే మహిళపై దాడి చేసి జుట్టు కత్తిరించి, అవమానానికి గురిచేసిన దోషులను తక్షణం అరెస్టు చేయాలని గురువారం వ్యవసాయ శాఖ జిల్లా కోశాధికారి సాకే వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా మహిళలు మీద దాడులు పెరిగాయని దాడులు అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్