పుట్టపర్తి: ఐసీడీఎస్ పీడీగా బాధ్యతలు చేపట్టిన తోట శ్రీదేవి

71చూసినవారు
పుట్టపర్తి: ఐసీడీఎస్ పీడీగా బాధ్యతలు చేపట్టిన తోట శ్రీదేవి
శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా తోట శ్రీ దేవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరులోని ఐసీడీఎస్ డైరెక్టరేట్ కార్యాలయంలో పని చేస్తున్న శ్రీదేవిని శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ ఛార్జ్ పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి ఏసీడీపీఓగా గతంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే డిప్యూటేషన్ పై డైరెక్టరేట్ లో పని చేస్తున్న ఆమెను జిల్లా ఇన్ ఛార్జ్ పీడీగా నియమించారు.

సంబంధిత పోస్ట్