నేటి నుంచి సబ్సిడీ వేరుశనగకు రిజిస్ట్రేషన్

562చూసినవారు
నేటి నుంచి సబ్సిడీ వేరుశనగకు రిజిస్ట్రేషన్
పుట్టపర్తి ఖరీఫ్ లో సాగు చేయడానికి అవసరమైన సబ్సిడీ వేరుసెనగకు రైతులు శుక్రవారం నుంచి ఆర్ బి కే లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2, 44, 763 హెక్టార్లు కాగా వేరుశనగ విస్తీర్ణం 1, 74, 910 హెక్టార్లు. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసుకోవడానికి 1, 00443 క్వింటాలు విత్తనాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్