ఈ నెల 15న హాకీ జట్టు ఎంపిక పోటీలు

78చూసినవారు
ఈ నెల 15న హాకీ జట్టు ఎంపిక పోటీలు
అనంతపురం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 15న శనివారం నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అనీల్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు ఆధారు కార్డ్, పదో తరగతి మార్కుల జాబితా, జనన ద్రువీకరణ పత్రం, క్రీడా సామగ్రి, యూనిఫాంతో హాజరుకావాలన్నారు. ఎంపికైన జట్టు ఈ నెల 27 నుంచి ధర్మవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్