రాష్ట్ర స్థాయి బాక్స్ లంగడి పోటీలో విద్యార్థినిల ప్రతిభ

71చూసినవారు
రాష్ట్ర స్థాయి బాక్స్ లంగడి పోటీలో  విద్యార్థినిల ప్రతిభ
రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మోడల్ స్కూల్ బాలికలు సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన.. బాక్స్ లంగడి ( కుంటి ఆట) పోటీలో పాల్గొని విజయం సాధించారు. రాష్ట్రస్థాయిలో జరిగిన క్రీడా పోటీలో ప్రతిభ కనబరిచిన అండర్ 17 బాలికలు రన్నర్స్ గాను, అదే క్రీడలలో అండర్ 19 బాలికలు విన్నర్స్ గాను విజయం సాధించారు. బాక్స్ లంగడి గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన బాలికలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్