బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరు గ్రామ శివారులో పేకాట స్థావరాలపై సోమవారం రాత్రి ఎస్ఐ నబిరసూల్ తన సిబ్బందితో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 9 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 59, 600లు, 4ద్విచక్ర వాహనాలు, 9సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట రాయుళ్లు నలుగురు తప్పించుకున్నారన్నారు.