రాయదుర్గం: వేదవతి నది ఉధృతికి కొట్టుకు పోయిన బ్రిడ్జి
బొమ్మనహల్ మండలం కళ్ళుదేవనహళ్ళి వద్ద వేదవతి నది ఉధృతికి రూ. 1. 2కోట్లతో నిర్మించిన బ్రిడ్జి కొట్టకుపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంగళవారం విలేఖరులకు తెలిపారు. రైతులు పరిస్థితి మరింత వర్ణనాతీతంగా మారింది. 2 కిలోమీటర్ల దూరంలోని పొలానికి నదిలోనే సాహసం చేసి చాలామంది దాటాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వాహనాలు 30 కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి వస్తుందన్నారు.