గార్లదిన్నె: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

58చూసినవారు
గార్లదిన్నె: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
గార్లదిన్నె మండలంలో విషాద ఘటన జరిగింది. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక నాగరాజు అనే వ్యక్తి సోమవారం తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్