అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శింగనమల, గార్లదిన్నె, నార్పల పోలీసు అధికారులు, సిబ్బంది మట్కా, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా వుంచినట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్న మట్కా, పేకాటలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.