తాడిపత్రిలో 14 మంది మట్కారాయుళ్లు అరెస్టు

65చూసినవారు
తాడిపత్రిలో 14 మంది మట్కారాయుళ్లు అరెస్టు
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో తాడిపత్రి అర్బన్ పోలీసులు మట్కాపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రి పట్టణంలోని గాంధీకట్ట, శివాలయం ప్రాంతాలలో మట్కా రాస్తున్నట్లు సమాచారం అందడంతో అర్బన్ సి. ఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 14 మంది మట్కారాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ధ నుండీ రూ. 2. 19 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్