తాడిపత్రి రూరల్ పోలీసు స్టేషన్ ఎస్సైగా ధరణి బాబు నియమిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ధరణి బాబు తనకల్లు పోలీసు స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ ఉత్తర్వులు మేరకు త్వరలో ఆయన తాడిపత్రి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో తాడిపత్రి పట్టణ ఎస్సైగా ధరణి బాబు విధులు నిర్వహించారు.