యాడికి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జనార్ధన్ నాయుడు తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యదర్శుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం యాడికి శివారులోని డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి వీర్రాజు, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.