మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో కూరగాయల పాత్ర ఎక్కువ ఉందని కళాశాల సెక్రటరీ సురేష్ రెడ్డి అన్నారు. తాడిపత్రి మండలంలోని తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం కూరగాయల ఉపయోగాల పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆహారంలో కూరగయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కూరగాయలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్నారు.