తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం

8051చూసినవారు
తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణ పరిధిలోని యల్లనూరు రోడ్డు సమీపంలో ఉన్న గానుగ వీధిలో టీడీపీ నేత సూర్యముని నివాసం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి టౌన్ సీఐ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ కూడా దాడిలో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్