పాల ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు

78చూసినవారు
పాల ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు
పెద్దవడుగూరు మండల కేంద్రంలోని నల్లగుట్ట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. పామిడి మండలం గజరాంపల్లికి చెందిన మల్లికార్జున పెద్దవడుగూరు నుంచి పాలను సేకరించే ఆటోను పామిడికి తీసుకెళ్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో డ్రైవరు మల్లికార్జున తీవ్రంగా గాయపడ్డాడు. పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్