పెద్దవడుగూరు ఎండీవో కార్యాలయంలో శనివారం కిశోరి వికాసంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సీడీపీఓ షాజిదా బేగం, ఎస్ఐ ఆంజనేయులు, ఎండీఓ నరసింహారెడ్డి, మెడికల్ ఆఫీసర్ అమర్నాథ్, ఎంఈఓ రాముడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడారు. బాల్య వివాహాలను అరికట్టడం అందరి బాధ్యతన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అనంతరం పోస్టర్లు విడుదల చేశారు.