యాడికి మండల కేంద్రంలో ఎమ్మార్వో ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని భూమి రికార్డులు సర్వే నంబర్ తప్పులను, మిగులు భూమి సమస్యలను రెవిన్యూ కు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.