వృద్ధుడి అనుమానాస్పద మృతి

3253చూసినవారు
వృద్ధుడి అనుమానాస్పద మృతి
పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఆదివారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానికులు ఇచ్చిన సమమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతుడు యల్లనూరు మండలం పాతపల్లికి చెందిన తిరుపాల్ రెడ్డి(60)గా గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్