దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్

63చూసినవారు
తాడిపత్రి మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు డి. ఎస్. పి రామకృష్ణుడు బుధవారం పేర్కొన్నారు. మండలంలోని ఇగుడూరు గ్రామంలో కృష్ణమూర్తి, నారాయణస్వామి, సూర్యనారాయణ ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. అదే గ్రామానికి చెందిన ముద్దాయిలు నరేంద్ర, భైరవుడలను అదుపులోకి తీసుకొని రూ. 3, 45, 000 నగదు తో పాటు 6. 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్