అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. యాడికి మండల కేంద్రంలో ఆదివారం మద్యాహ్నం తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామానికి చెందిన వెంకటరమణయ్య, దాసరి నారాయ ణస్వామి, అన్వేష్ కుమార్ పెన్నానది నుంచి ఇసుకను ట్రాక్టర్లలో నింపుకుని యాడికి మీదుగా తరలిస్తుండటంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.