అప్పుల బాధతో ఆగిన రైతు గుండె

65చూసినవారు
అప్పుల బాధతో ఆగిన రైతు గుండె
వజ్రకరూర్ మండలంలోని కొనకొండ్ల గ్రామంలో మిరపపంట నష్టపోయి పెట్టుబడులు తిరిగి రాక మనోవేదనకు గురైన కౌలు రైతు రవి(38) గుండె ఆగిపోయింది. గత సంవత్సరం రవి నాలుగు ఎకరాలలో కౌలుకు మిరపపంట సాగుచేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. దీంతో ఎనిమిది లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలన్న ఆలోచనలతో ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చి మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్