ఉరవకొండ టౌన్ పరిధిలో ఐదవ సచివాలయంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ శర్మస్ బీ మంగళవారం సచివాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే గత కొద్ది రోజులుగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఈ బాధలన్నీ భరించలేక మనస్థాపానికి గురై ఆశా వర్కర్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.