ఆస్తి తగాదాలతో గొడవ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

7145చూసినవారు
ఆస్తి తగాదాలతో గొడవ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ అతని కుమారులు లోకేశ్, ధనుంజయపై అదే గ్రామానికి వెంకటనారాయణ, అతని కొడుకు అమర్ కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆస్తి వివాదం నేపథ్యంలో వ్యవసాయ పొలంలోనే రామకృష్ణ అతని కుమారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్