ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయని శుద్ధజల యంత్రం

63చూసినవారు
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయని శుద్ధజల యంత్రం
ఉరవకొండ నియోజకవర్గంలోనే అదో అతిపెద్ద ఆసుపత్రి. కానీ అక్కడ సౌకర్యాలు మాత్రం ఏం ఉండవు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు, వారి సహాయకులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 50 పడకల ఆసుపత్రిలో కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. మొదటి అంతస్థులో శుద్ధజల యంత్రం కొన్ని నెలలుగా పనిచేయడం లేదని, తాగడానికి నీళ్లు కొనుక్కుంటున్నామని రోగులు, వారి బంధువులు వాపోయారు.

సంబంధిత పోస్ట్