కన్నులపండువగా శ్రీవారి మడుగు తేరు ఉత్సవం

565చూసినవారు
పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి మడుగు తేరు ఉత్సవం మంగళవారం ఉదయం భక్తుల గోవింద నామస్మరణతో వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు అనంతరం అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి రథంపై కొలువుదీర్చారు. అనంతరం ఉద్బవ లక్ష్మీ అమ్మవారి ఆలయం వరకు రథాన్ని లాగారు. సాయంత్రం మహారథోత్సవం ఉంటుందని ఈఓ విజయ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్