బైక్ అదుపుతప్పి బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

3265చూసినవారు
బైక్ అదుపుతప్పి బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు
కూడేరు మండలం పెన్నా నది వంతెన వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ నుంచి ఉడిరిపికొండ గ్రామానికి వెళ్తున్న వీరాంజనేయులు బైక్  అదుపుతప్పి బోల్తా పడడంతో తీవ్రంగాగాయపడ్డాడు. స్థానికులు 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్