పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉవకొండ పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు చేయడానికి మేజర్ గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. మంగళవారం పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ ఆదేశాల మేరకు సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు పట్టణంలోని వివిధ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లను గుర్తించి వాటిని జప్తు చేసి దుకాణం యజమానులకు జరిమానా విధించారు.