కూడేరు మండలంలో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట ఆడితే చర్యలు తప్పవని సీఐ రాజు హెచ్చరించారు. గురువారం కూడేరు పోలీస్ స్టేషన్ లో సిఐ రాజు విలేఖరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజులలో సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. జూద క్రీడలు కాకుండా సంప్రదాయ ఆటలు ఆడుకోవాలని సూచించారు.