వజ్రకరూరు మండలం చిన్న హోతూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ వెంకటేశులు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. తన తండ్రి ఎల్లప్ప ఆశయాలను కొనసాగిస్తూ సీపీఐలో సేవలందించిన ఆయన పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారు. కామ్రేడ్ వెంకటేశులు మృతి సీపీఐ పార్టీకి తీరని లోటని సీనియర్ నాయకుడు శ్రీధర్ అన్నారు.