జమ్మలమడుగులోని ఐటిఐ కళాశాలలో ఉన్నతి సంస్థ ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని.. ఉన్నతి చెంజ్ మెకర్ సుబహన్ అన్నారు. ఉన్నతి సంస్థ పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సహాయపడుతుంది. దీనిని 2003లో రమేష్ స్వామి ప్రారంభించారు. దీని ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉపాధి పొందుతున్నారు. ఉన్నతి దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ స్వరుప్ కూమార్ పాల్గొన్నారు.