ఎర్రగుంట్ల ఆర్టిపిపిలో మంగళవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి గొడవలు జరగకుండా జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వరరావు ఆధ్వరంలో నలుగురు సిఐలు, 80 మంది సిఐ, పోలీసులు భారీగా మోహరించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జె. సి. గ్రూపుల మధ్య చెరువులోని ఫ్లయాష్ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. జెసి గ్రూపునకు చెందిన వారిని ఫ్లయాష్ తరలించకుండా వాహనాలను ఆది గ్రూపునకు చెందిన వారు అడ్డుకున్నారు.