కడప జిల్లా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలు రేంజి డీఐజీ కోయప్రవీణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంకు వారు కూడా ఓటీపీలు అడగరని, ఎవరికీ ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, డిజిటల్ అరెస్టులు నమ్మవద్దని అవన్నీ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలని చెప్పారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.