వైఎస్ జగన్‌పై షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కూ సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే. అవన్నీ కుటుంబ ఆస్తులే. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాల్సిన బాధ్యత ఆయనదే.’ అని షర్మిల అన్నారు.