ఉపాధ్యాయులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు క్రీడ, సాంస్కృతిక పోటీలు ఎంతగానో తోడ్పడతాయని ప్రముఖ వైద్యులు డాక్టర్. ఎస్. ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం కడప నగరంలోని అంధుల పాఠశాలలో యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు నిర్వహిస్తున్న క్రీడ, సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.