యోగి వేమన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ బ్లాక్ ను ప్రధాన ఆచార్యులు ఎస్ రఘునాథరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంగ్లీష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, హిస్టరీ, ఉర్దూ తెలుగు శాఖలలో రికార్డులను పరిశీలించారు. బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని సూచించారు.