పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కడప జిల్లా ఏఎస్పి ప్రకాష్ బాబు అన్నారు. శనివారం కడప నగర శివారులోని దేహదారుఢ్య పరీక్షలు జరిగే జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఈనెల 30 నుండి జనవరి 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.