చెన్నూరు: "పకడ్బందీగా భూముల రీ సర్వే"

60చూసినవారు
చెన్నూరు: "పకడ్బందీగా భూముల రీ సర్వే"
రైతులకు సంబంధించిన భూముల రీ సర్వే పకడ్బందీగా చేపడుతున్నట్లు కడప ఆర్డిఓ జాన్ లెర్విన్ పాలపర్తి అన్నారు. చెన్నూరు మండలంలోని శివాలపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం పైలెట్ ప్రాజెక్టు కింద భూముల రీ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు ఆంధ్ర భూముల రీ ద్వారా శివాలపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 897. 65 ఎకరాల రైతులకు సంబంధించిన భూములను రీ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్