యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పరిశోధకురాలు వేలూరు భారతికి విశ్వవిద్యాలయం సోమవారం డాక్టరేటు డిగ్రీ ప్రదానం చేసింది. వైవీయూ తెలుగుశాఖ ఆచార్యులు టి. రామప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో “ఒక శతాబ్దపు రాయలసీమ కథానిక-స్త్రీ (1926 నుండి నేటి వరకు) అనే అంశంపై ఈమె చేసిన పరిశోధనకుగాను డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కెఎస్వీ కృష్ణారావు తెలిపారు.