వల్లూరు మండల పరిధిలోని చెరువు క్రింద పల్లి పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలపై పోలీసులు దాడి చేశారు. దాడి చేసి ఐదు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.