రామసముద్రం- కొత్త మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నూతన మద్యం పాలసీ ప్రకారం రామసముద్రం మండలంలో ఒక మద్యం దుకాణం ఏర్పాటు కానుంది. ఈ దుకాణం లైసెన్స్ సంబంధించిన దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటివరకు షాప్ నెంబర్ 81 కి దాదాపు 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.