మదనపల్లె: విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం

56చూసినవారు
మదనపల్లె: విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. బుగ్గ కాలువలో ఉంటున్న ఓ యువతి తండ్రి చనిపోవడం, తల్లి దూరంగా ఉండడంతో మనస్తాపానికి గురైంది. దీంతో శుక్రవారం ఉదయం ఆమె పురుగులమందు తాగింది. స్థానికులు గమనించి బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్