ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శనం అన్నారు. రామసముద్రంలో శుక్రవారం ఆయన మండల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించి మాట్లాడారు. వర్గీకరణను వ్యతిరేకించాలని మండల, డివిజన్, రాష్ట్రస్థాయి కమిటీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.