మదనపల్లిలో జోరుగా ప్రైవేటు బస్సు యజమానుల దందా!
మదనపల్లిలో ప్రైవేటు బస్సు యజమానులు అక్రమ దందా నడుపుతూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను నడ్డి విరుస్తున్నారని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి నుండి బెంగళూరుకు ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపక పోవడంతో సమస్యలు వస్తున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రైవేటు బస్సు యాజమాన్యాల అక్రమ దందాను అరికట్టాలని కోరారు.