కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని నంద్యాల రోడ్ 49వ జాతీయ రహదారిపై శ్రీనగరం గ్రామం వద్ద సోమవారం కారు బైక్ ను ఢీకొన్న సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మైదుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.