రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన విధానంతో తాము ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం నుంచి బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు. అంతవరకు విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.